స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ ప్రస్తుతం సుకుమార్( డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్లో వస్తున్న 'పుష్ప2' సినిమాలో నటిస్తోంది.దీనితో పాటు మరికొన్ని సినిమాలతో బిజీ బిజీగా ఉన్నది. అయితే ఈ బ్యూటీ, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay devarakonda) కలిసి గీత గోవిందం(Geetha Govindam), డియర్ కామ్రేడ్(Dear Comrade) వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే గురువారం దీపావళి(Diwali) సందర్భంగా ఈ భామ విజయ్ వాళ్ళ ఇంట్లో అనగా కాబోయే అత్తారింట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ డ్రెస్ వేసుకొని దీపాలను పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. అంతే కాకుండా ఈ పిక్స్ విజయ్ దేవరకొండ తమ్ముడు తీసినట్టు ఫొటో క్రెడిట్స్ టు ఆనంద్ దేవరకొండ.. థాంక్యూ ఆనందా అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ అమ్మడు విజయ్ ఇంట్లోనే దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఇన్ని రోజులుగా వీరు లవ్లో ఉన్నది నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనిపై వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం నేషనల్ క్రష్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.
#Rashmikamandanna pic.twitter.com/o7KeZE8ers
— VD bulletin (@vdbulletin) November 1, 2024