తెలుగు ప్రజలపై తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. '300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారు' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారే ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు. తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.