ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి పల్లవికి చేదు అనుభవం...

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 12:53 PM

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక తెలుగులో వరుసగా లు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ లు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ లు చేస్తోంది. రామాయణం లో సీతగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు.ఎలాంటి డిమాండ్‌లు లేకుండా షూటింగ్‌లో పాల్గొంటుంది ఈ చిన్నది. అయితే సాయి పల్లవికి ఓ సెట్లో కాస్త చేదు అనుభవం ఎదురైందట, షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల్లోనే సాయి పల్లవి సెట్ వదిలి బయటకు వెళ్లాలనిపించిందట. ఆ ఏది అంటే.. తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా సాయి పల్లవి ‘NGK’ లో నటించింది.. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. లో నటించేందుకు సాయి పల్లవి చాలా ఇంట్రెస్ట్ చూపించిందట. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల తర్వాత సెట్ నుంచి వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చిందని తెలిపింది సాయి పల్లవి.


ఈ విషయమై సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘ లో మేం ఏదైనా షాట్ చేసిన తర్వాత సెల్వరాఘవన్ మాకేమీ చెప్పేవారు కాదు.. నాతో కూడా సరిగ్గా మాట్లాడేవారు కాదు. నేను సరిగ్గా ప్రవర్తిస్తున్నానా.? లేదా? అనే అనుమానం వచ్చింది. సెల్వరాఘవన్ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వకపోవడాన్ని చూసి.. నేను సరిగ్గా నటించడం లేదని, రెండు రోజులుగా షూటింగ్ సరిగ్గా రావడం లేదని, నుంచి తప్పుకోవాలని అనుకున్నాను’ అని సాయి పల్లవి తెలిపింది.అయితే ఆ తర్వాత సెల్వరాఘవన్ సోదరుడు స్టార్ యాక్టర్ ధనుష్ ఫోన్ చేసి అనుభవం ఎలా ఉందని అడిగితే సాయి పల్లవి తన సమస్య గురించి చెప్పిందట. సెల్వరాఘవన్ నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదు, ఇలా నటించమని కూడా చెప్పడం లేదు అని చెప్పిందట సాయి పల్లవి. అప్పుడు ధనుష్ ‘అది ఆయన స్టైల్, ముందుగా నటీనటులను పరీక్షించి, తర్వాత నటించమని అడుగుతారు’ అని అన్నారు. ఆ తర్వాత సాయి పల్లవికి కాస్త ధైర్యం వచ్చింది.


నిజానికి ‘NGK’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సాయి పల్లవి నటించిన అమరన్ చిత్రం ఇటీవల విడుదలైంది. లో సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తెలుగులో సాయి పల్లవి నటించిన ‘తండేల్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. సాయి పల్లవి బాలీవుడ్‌లో రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అమీర్ ఖాన్ పుత్ర లో సాయి పల్లవి నటిస్తుంది. రణ్‌బీర్‌ కపూర్‌, యష్‌ల 'రామాయణం' ఆధారంగా తెరకెక్కుతున్న లో సాయి పల్లవి సీతగా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com