బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్ ఖాన్ ను బెదిరించారు.ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఈ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని హెచ్చరించారు.మరోసారి పాటలు రాయలేని విధంగా ఉంటుందని గుర్తు తెలియని దుండగులు పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ కు ధైర్యం ఉంటే వారిని రక్షించుకోవాలని హెచ్చరించారు. ఈ వ్యక్తులపై వర్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ కాల్స్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు బిష్ణో య్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలోని హవేరిలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా..రాజస్థాన్ లో మరో వ్యక్తిని కూడా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ కు పోలీసులు అప్పగించారు
అటు తాజాగా మరో అగ్రనటుడు షారుక్ ఖాన్ కూడా సల్మాన్ తరహా బెదరింపులు వచ్చాయి. రూ. 50లక్షలు ఇవ్వకుంటే హాని తలపెడతమాంటూ ముంబై పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో... ఆ ఫోన్ కాల్ ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ కు చెందిన ఫైజన్ అనే పేరు తో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.