శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కుబేర చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం పాత్ర పరిచయాలు మరియు గ్లింప్సె సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క గ్లింప్సె ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ గ్లింప్సె 6 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న కుబేర సినిమాని 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.