డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా హనుమాన్ తో అటు ఇంటర్నేషనల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఒక్క మూవీతోనే యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులను ఆకర్షించారు. హనుమాన్ మూవీ డైరెక్షన్ పై సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆయన తెరకెక్కించబోయే హనుమాన్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా..మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో కన్నడ హీరో రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం హనుమాన్ పార్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ.. తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. యంగ్ హీరో అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రశాంత్ వర్మ. ఈ సందర్భంగా.. తాను దర్శకుడు కాకముందే 33 కథలు రాసుకున్నట్లు వెల్లడించారు. వాటిలో ఒక కథ యాంకర్ సుమ కుమారుడి కోసం చెప్పినట్లు తెలిపారు.
“నేను ఇండస్ట్రీలోకి రాకముందే 33 కథలు రాసుకున్నాను. ఇప్పటివరకు తీసిన లకు వాటికి ఎలాంటి సంబంధం లేదు.. నాకు కథలు రాయడం చాలా ఇష్టం. అవకాశమిస్తే దర్శకత్వం మానేసి వేరే దర్శకుల కోసం కథలు రాయడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. కావాలంటే బోయపాటి శ్రీను గారికి కూడా కథలు ఇస్తాను” అని అన్నారు. దీంతో డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ.. తాను రాసుకున్న కథలు వేరే దర్శకులకు ఇవ్వాలంటే మంచి మనసు ఉండాలని.. ప్రశాంత్ వర్మ మనసున్న వ్యక్తి అని అన్నారు.