హైదరాబాద్‌లో ఈనెల 4న అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. అయితే వివాహ తంతులో భాగంగా పెళ్ళికి ముందే వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు జరగ్గా, ఇందుకు సంబందించిన ఫొటోలు వైరలవుతున్నాయి. తాజాగా శోభితను పెళ్లి కూతురు చేసిన ఫొటోలను నిర్వాహకులు షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో Dec 4న వివాహం జరగనుంది.ఇలా ఉండక నాగార్జున తన కుమారుడు నాగచైతన్య వివాహాని కి ఓ లగ్జరీ కారు ను బహుమతి గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట . ఇక దాని కోసం సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన .... కారు ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది .. రీసెంట్ గానే హైదరాబాదు లోని ఆర్టిఏ కార్యాలయం లో ఈ కారుకి రిజిస్ట్రేషన్ చేసుకోవడాని కి వచ్చినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది . ఇక ఆ కారును హైబ్రిడ్ - ఎలక్ట్రిక్ డిజైన్ తో వచ్చింది . , కార్బన్ - న్యూట్రల్ ఫీచర్వి తో పాటు చాలా లగ్జరీ ఫీచర్స్ ను అద్భుతమైన ఇంటీరియర్ ను కలిగి ఉంది .