అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంది. ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నాగచైతన్య- శోభిత పెళ్లి ఫొటోలను తాజాగా నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మీడియాకు, ఫ్యాన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్.. మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశాయి. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది’ అని పేర్కొన్నారు.