ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. రాజమౌళి, ప్రభాస్ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో.. బాహుబలి 2ని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసినప్పటికీ..1800 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కానీ.. ఇప్పుడు పుష్ప 2 ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. లాంగ్ రన్‌లో ఎంత వసూలు చేస్తుందనేది పక్కన పెడితే.. ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్టుగానే.. ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఆర్ఆర్ఆర్ 223 కోట్లు, బాహుబలి 2.. 215 కోట్లను సింగిల్ హ్యాండ్‌తో లేపేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వరల్డ్ వైడ్‌గా 12 వేలకు పైగా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా 294 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన రికార్డు నమోదు చేసింది.
దీంతో.. పుష్పరాజ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతున్న పుష్ప2.. హిందీలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తూ.. ఏకంగా 72 కోట్లు కొల్లగొట్టింది. ఇటు కేరళలోను ఆరున్నర కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్, కన్నడలో కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్, డే 1 కలెక్షన్స్ కలుపుకొని 4.4 మిలియన్ డాలర్స్ రాబట్టి.. టాప్ 3లో నిలిచింది. ఇక పుష్ప పార్ట్ 1లో మాసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బన్నీ.. పార్ట్ 2లో అంతకుమించిన పర్ఫార్మెన్స్ ఇచ్చి.. పూనకాలు తెప్పించాడు. మరోసారి బన్నీకి నేషనల్ అవార్డ్ రావడానికి ఒక్క జాతర ఎపిసోడ్ చాలని అంటున్నారు. మరి పుష్పరాజ్ నెంబర్ లాంగ్ రన్‌లో ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.