శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ కామెడీ విశ్వం చిత్రంలో కనిపించిన మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. విశ్వం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వనప్పటికీ, నటుడు ఉత్తేజకరమైన కొత్త వెంచర్‌తో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఘాజీ మరియు అంతరిక్షం 9000 KMPH చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ తన తదుపరి ప్రాజెక్ట్ ని చేయనున్నట్లు సమాచారాం. అధికారిక ప్రకటన ఇంకా రావలిసి ఉండగా, ఇది అభిమానులలో సందడిని సృష్టిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.