హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తో టాలీవుడ్ షాక్ కు గురైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ ను వైద్య పరీక్షల కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బన్నీ అరెస్ట్ వార్త తెలియగానే 'విశ్వంభర' షూటింగ్ ను చిరంజీవి రద్దు చేసుకున్నారు. అక్కడ నుంచి ఆయన అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. మరోవైపు, కాసేపటి క్రితమే నిర్మాత దిల్ రాజు చిక్కడపల్లి పీఎస్ కు చేరుకున్నారు. అంతకు ముందే అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు అర్జున్ మామ (భార్య తండ్రి) పీఎస్ కు వచ్చారు.