ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కూడా కీర్తి సురేశ్, ఆంటోనీ ఒక్కటయ్యారు

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:23 PM

సౌతిండియా బ్యూటీ కీర్తి సురేశ్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ తో ఇటీవల పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీరి పెళ్లి గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. తాజాగా, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కూడా కీర్తి సురేశ్, ఆంటోనీ ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కీర్తి, ఆంటోనీ తెల్లని దుస్తుల్లో మెరిసిపోయారు. ఇరు కుటుంబాలకు చెందినవారు, బంధుమిత్రుల కోలాహలం నడుమ వీరి పెళ్లి ఘనంగా జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com