బాలీవుడ్ నటి కైరా అద్వానికి టాలీవుడ్ నటుడు విజయ్‌దేవరకొండ ఓ గిఫ్ట్‌ని పంపాడట. సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రూ. 200 కోట్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయానికి గుర్తుగా కైరా కి విజయ్ దేవరకొండ ఓ బహుమతిని పంపాడు. తనకు ఎంతో ఇష్టమైన డ్రెస్ ను గిఫ్ట్ గా పంపుతున్నానని… తప్పుగా అనుకోవద్దని ఒక మెసేజ్ కూడా పెట్టాడట. గిఫ్ట్ పంపినందుకు విజయ దేవరకొండకు కైరా ధన్యవాదాలు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa