ట్రెండింగ్
Epaper    English    தமிழ்

70 ఏళ్ల నటుడితో లవ్‌లో పడ్డ హీరోయిన్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 12:43 PM

ప్రేమకు కులం, మతం, జాతి, రంగు, వయసుతో సంబంధం లేదు. కానీ రియల్ లైఫ్‌లోనూ ఇదే నిజమంటుంది ఓ హీరోయిన్. 31 ఏళ్ల నటి శివంగి వర్మ ప్రముఖ 70 ఏళ్ల నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. “ప్రేమకు వయసు, పరిమితులు లేవు” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. అవును ప్రేమకు కావాల్సింది వయసు కాదు డబ్బు అని, నీ తండ్రి ఏజ్‌లో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడటానికి సిగ్గు లేదా అంటూ కొంత మంది ఏకిపారేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని.. ఈ క్రమంలోనే షూటింగ్ సెట్‌లో సరదాగా ఉన్న ఫొటో షేర్ చేసిందని, కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. కాగా తమపై వస్తున్న ట్రోలింగ్ పై ఇటు శివంగి కానీ అటు గోవింద్ నామ్ దేవ్ కానీ స్పందించలేదు. వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com