మీడియా ప్రతినిధిపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈరోజు మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మోహన్ బాబు తన బెయిల్ దరఖాస్తులో తన ఆరోగ్య సమస్యలను ఉటంకిస్తూ, బెయిల్ కోసం అభ్యర్థించారు. అయితే మోహన్‌బాబు బెయిల్ పిటిషన్‌పై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇప్పుడు మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. కాగా కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. మోహన్‌బాబుకు డిసెంబర్ 24 వరకు సమయం ఉందన్నారు. ఆస్తుల విషయంలో మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని, వార్తలను కవర్ చేసేందుకు జర్నలిస్టులు వెళ్లగా టీవీ రిపోర్టర్‌పై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే.