ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సల్మాన్‌, మీరు డేట్‌ చేశారా?’: ప్రీతి జింటాను ప్రశ్నించిన నెటిజన్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 03:55 PM

బాలీవుడ్‌ నటి ప్రీతి జింటాకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. సల్మాన్‌ ఖాన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఆమె పోస్ట్‌ పెట్టగా.. ఆయనతో డేట్‌లో ఉన్నారా? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. దీనిపై ఆమె సల్మాన్‌ తనకు కుటుంబసభ్యుడితో సమానం అని స్పష్టం చేశారు. ‘‘మేమిద్దరం అస్సలు డేట్‌ చేయలేదు. తను నాకు కుటుంబసభ్యుడితో సమానం. అలాగే నా భర్తకూ అతను మంచి ఫ్రెండ్. నా సమాధానంతో మీరు ఆశ్చర్యానికి గురైతే నన్ను క్షమించండి’’ అని తెలిపారు.నెటిజన్‌ తీరుపై పలువురు అసహనం వ్యక్తంచేశారు. పెళ్లయిన తర్వాత ఒక నటిని ఇలాంటి ప్రశ్నలు వేయడం ఏ మాత్రం సరి కాదని హితవు పలికారు. ‘దిల్‌ సే’ చిత్రంతో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన ఆమె ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజ కుమారుడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 2018లో విడుదలైన ‘భయాజీ సూపర్‌హిట్‌’ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ‘లాహోర్‌ 1947’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ప్రీతి జింటా, సల్మాన్‌ఖాన్‌ ‘హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా’, ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ వంటి హిందీ చిత్రాలతో ఆన్‌స్ర్కీన్‌ మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రాల వల్ల వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సల్మాన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆమె విషెస్‌ తెలుపుతుంటారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భఃగా పోస్ట్‌ పెట్టారు. పలు సందర్భాల్లో ఆయనతో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. ‘‘హ్యాపీ బర్త్‌డే సల్మాన్‌. లవ్‌ యూ మోస్ట్‌. మిగిలిన విషయాలు మనం కలిసినప్పుడు చెబుతా. మనం కలిసి ఎన్నో ఫొటోలు దిగాలి. లేదంటే ఆ పాత ఫొటోలనే నేను ప్రతిసారీ పోస్ట్‌ చేస్తా’’ అని సరదాగా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com