ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 1న రానున్న గేమ్‌ఛేంజర్‌ ట్రైలర్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2024, 05:51 AM

హీరో రామ్‌చరణ్‌ 256 అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటుచేసి మెగా అభిమానులు వరల్డ్‌ రికార్డు సాధించారని నిర్మాత దిల్‌ రాజు కొనియాడారు. విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన ఈ కటౌట్‌కు ఆదివారం హెలికాప్టర్‌ ద్వారా పూలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దిల్‌ రాజు మాట్లాడుతూ సినీ రాజధాని, తెలుగు సినిమా పుట్టినిల్లుగా పేరొందిన విజయవాడలో ఈ ఈవెంట్‌ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జనవరి 1న గేమ్‌ఛేంజర్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నామని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చే సమయాన్ని బట్టి జనవరి 4, 5 తేదీల్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసినందుకు గాను ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ రికార్డ్‌ను ఆ సంస్థ ప్రతినిధులు దిల్‌ రాజుకు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa