ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాహిద్ క‌పూర్ ‘దేవా’ టీజ‌ర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 05, 2025, 03:38 PM

బాలీవుడ్ న‌టుడు షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం దేవా . బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ దేవా సినిమాను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రూపొందుతుండగా.. మ‌ల‌యాళ దర్శ‌కుడు రోష‌న్ ఆండ్రోస్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.పూజ హెగ్దే, పావేల్ గులాటి త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వరి 31న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. టీజ‌ర్ చూస్తుంటే.. షాహిద్ రూత్‌లెస్‌ పోలీస్‌గా అల‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. కాగా ఈ టీజ‌ర్‌ను మీరు చూసేయండి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa