ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన్మధుడు 2' నుంచి రకుల్ లుక్ వచ్చేసింది

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2019, 10:50 AM

కొంద‌రు హీరోయిన్స్ పాత్ర‌ల కోసం బోల్డ్‌గా నటిస్తుంటారు.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో సిగ‌రెట్స్‌, మందు తాగే సీన్స్‌లో న‌టించ‌డానికి కూడా వెనుకాడ‌రు. ఇలాంటి హీరోయిన్స్ జాబితాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. `మ‌న్మ‌థుడు 2` సినిమాలో అవంతిక అనే పాత్ర‌లో ర‌కుల్ మెప్పించ‌నుంది. ఈ పాత్ర గురించి ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.`అవంతిక పేరు ఎంత విన‌సొంపుగా ఉంది.. అంతే ప‌ద్ధ‌తి గ‌ల అమ్మాయి` అని ల‌క్ష్మి చెప్పే డైలాగ్‌తో పాటు సంప్ర‌దాయబ‌ద్ధమైన లుక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌నిపించింది. అలాగే హాట్ లుక్‌లోనూ క‌న‌ప‌డింది.`ఇప్ప‌టి వ‌ర‌కు యు సర్టిఫికెట్ ట్రై చేశాను. ఇక‌పై ఏ స‌ర్టిఫికెట్ చూపిస్తా..` అంటూ ర‌కుల్ నాగ్‌తో చెప్పే డైలాగ్‌తో పాటు ర‌కుల్ సిగ‌రెట్ తాగి పొగ వ‌దిలే సీన్‌లో క‌న‌ప‌డింది. ఈ సీనే ఈ ప్రోమోలో హైలైట్‌గా నిలుస్తుంది.


`ఈమెను మీరు ప్రేమిస్తారు లేదా ద్వేషిస్తారు` అనే లైన్‌తో ర‌కుల్ చేసిన అవంతిక పాత్ర‌ను తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌.


నాగార్జున అక్కినేని హీరోగా న‌టించిన `మ‌న్మ‌థుడు 2` ఆగ‌స్ట్ 9న విడుద‌ల‌వుతుంది. ఇందులో నాగ్ ప్లేబోయ్ పాత్ర‌లో న‌టించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa