ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్రెస్టింగ్‌గా ‘బాట్లా హౌస్‌’ ట్రైల‌ర్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2019, 12:54 PM

 బాలీవుడ్ డైరెక్ట‌ర్ నిఖిల్‌ అడ్వాణీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బాట్లా హౌస్‌’. ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం.. మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టిస్తున్నారు. రవి కిషన్‌, ప్రకాశ్‌రాజ్‌, సోనమ్‌ అరోరా తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 2008 సెప్టెంబరు 18న దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ‘బాట్ల హౌస్‌’ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొందరు స్థానికుల్ని కూడా పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిసింది, ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు అధికారి సహా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ అయితే పోలీసు అధికారి ఎలా చనిపోతారని పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. ఈ కేసులో అధికారులు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నిజ సంఘటన ఆధారంగా ‘బాట్లా హౌస్‌’ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో జాన్‌ అబ్రహం.. సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa