శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటులు నాగచైతన్య..సాయిపల్లవి నటించనున్నారు. అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేలా శేఖర్ కమ్ముల ఈ కథపై కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సెప్టెంబర్ తొలివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ప్రారంభించనున్నారు. డిసెంబర్‌లో ‘క్రిస్మస్’ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ దిశగానే షూటింగు షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa