ట్రెండింగ్
Epaper    English    தமிழ்

$1.2M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 05:49 PM

విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తునం' 2025 సంక్రాంతి విజేతగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫన్ థ్రిల్లర్ వెంకీ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని శ్లోక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA గ్రాస్ $1.2M ని వసూళ్లు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com