ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనోజ్ తో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందన్న రోహిత్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2025, 07:03 PM

మంచు మనోజ్ తో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని నారా రోహిత్ అన్నారు. 'భైరవం' సినిమాతో ఆ అనుబంధం మరింత పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు 'భైరవం' మూవీ టీజర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ నారా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. మనోజ్ కు జంటగా ఆనంది, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆదితి శంకర్, రోహిత్ కు జంటగా దివ్య పిళ్లై నటిస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa