ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పల్లెటూరిలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ క్రీడాకారుడిగా ఓ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఆయన గత కొద్ది రోజులుగా ఈ లుక్‌కు సంబంధించిన మేకోవర్‌లో ఉన్నాడు. అయితే 'గేమ్ ఛేంజర్' విడుదల తరువాత చరణ్ ఎటువంటి ఈవెంట్‌కు హాజరు కాలేదు. అయితే తాజాగా రామ్‌చరణ్ లేటెస్ట్ లుక్ బయటికొచ్చింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి బండ్రెడ్డి నటించిన 'గాంధీ తాత చెట్టు' ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తుండటం, ప్రత్యేకంగా ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన సుకృతికి ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్‌చరణ్‌తో పాటు ఆయన సతీమణి ఉపాసన 'గాంధీ తాత చెట్టు' టీమ్‌తో పాటు సుకృతిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈ ఫోటోస్‌లో రామ్‌చరణ్‌ను చూసిన ఆయన అభిమానులు లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.