ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘గేమ్ ఛేంజర్’ ఫలితంపై అంజలి ఏమన్నారంటే?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 10:42 AM

హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో 'గేమ్ ఛేంజర్' సినిమా ఫలితంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... నటి అంజలి స్పందించారు.సినిమా బాగోలేదని తనతో ఎవరూ చెప్పలేదన్నారు. మంచి సినిమా చేశావని చెప్పారని తెలిపారు. ఓ నటిగా తన బాధ్యతను నెరవేర్చానన్నారు. కొన్ని చిత్రాలను లేదా పాత్రలను బాగా నమ్మి చేస్తామని వెల్లడించారు. అలాంటి వాటిలో ఈ సినిమాలో పోషించిన పాత్ర కూడా ఒకటి అన్నారు. మంచి సినిమా అని ప్రేక్షకులు చెప్పారని, అంతవరకు చాలన్నారు. మిగిలిన అంశాల గురించి మాట్లాడాలంటే సమయం పడుతుందన్నారు.కాగా, విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన 'మదగజరాజ' చిత్రం ఈ నెల 12న తమిళంలో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ఈ నెల 31న తెలుగులో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై అంజలికి ప్రశ్న ఎదురైంది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com