ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో పెళ్లిపై రాఖీ సావంత్‌ సంచలన ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 04:28 PM

బాలీవుడ్‌ సెక్స్‌ క్వీన్‌గా పేరుగాంచిన రాఖీ సావంత్ .. తన చేష్టలు, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్‌ ఖాన్‌ దురానీ ని రహస్యంగా వివాహం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో విడిపోయింది. తాజాగా రాఖీ సావంత్‌ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు , నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిందిఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది రాఖీ. పెళ్లి విషయంలో తనకు చాలా ప్రతిపాదనలు వస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ (Dodi Khan)ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. గతంలో జరిగిన వివాహాల కారణంగా తాను ఎలా వేధింపులకు గురయ్యానో ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. పాకిస్థాన్‌లో తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని.. ఆ దేశ ప్రజలను తాను ప్రేమిస్తున్నట్లు పేర్కొంది.


డోడి ఖాన్‌తో వివాహం పాకిస్థాన్‌లో ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలిపింది. రిసెప్షన్‌ మాత్రం భారత్‌లో ఉంటుందని… పెళ్లి తర్వాత హనీమూన్‌ కోసం స్విట్జర్లాండ్‌ లేదా నెదర్లాండ్స్‌కు వెళ్లనున్నట్లు చెప్పింది. చివరిగా పెళ్లి తర్వాత దుబాయ్‌లో స్థిరపడనున్నట్లు రాఖీ సావంత్‌ వెల్లడించింది. ఇక రాఖీ ప్రకటన నేపథ్యంలో డోడి ఖాన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేశాడు. ‘రాఖీ జీ మన బరాత్‌ భారత్‌లోనా దుబాయ్‌లోనా’ అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో, రాఖీ సావంత్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే అని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోరు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.కాగా, రాఖీ సావంత్.. ఆదిల్ ఖాన్‌ దురానీని రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాము పెళ్లి చేసుకున్నాం అంటూ 2023 జనవరిలో ప్రకటించారు. అయితే వీరి వివాహబంధం ఎన్నో రోజులు కొనసాగలేదు. ఆరు నెలలైనా తిరక్కముందే వివాహ బంధానికి ముగింపు పలికారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com