మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లైలా’. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా రిలీజైన టీజర్, ‘సోనూ మోడల్’ ఫస్ట్ సింగిల్, ‘ఇచ్చుకుందాం బేబి’ సెకండ్ సింగిల్ సెన్సేషన్‌ని క్రియేట్ చేసి సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం ఈ థర్డ్ సింగిల్‌కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ఈ పాటను పెంచల్ దాస్ పాడుతున్నారు. విశ్వక్సేన్ అమ్మాయి- అబ్బాయిగా కనిపించనున్న ఈ మూవీ.. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ మూవీ విడుదలకాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa