హీరో విశాల్, అభినయ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి. అయితే ఈ వార్తలపై నటి అభినయ తాజాగా స్పందించారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. తనకు ఆల్రెడీ ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని.. అతడితోనే రిలేషన్‌లో ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆ బాయ్‌ఫ్రెండ్ మాత్రం విశాల్ కాదని పేర్కొన్నారు.హీరో విశాల్ - హీరోయిన్ అభినయ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇప్పటి వరకు రిలేషన్‌లో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వార్తలపై విశాల్ ఇప్పటి వరకు స్పందించకపోగా.. నటి అభినయ మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa