ఆడై' తెలుగులో 'ఆమె' చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ మరో మారు ప్రేమలో పడిందట. ఓ వ్యక్తితో ప్రేమలో పడి ప్రస్తుతం ఆతనితోనే పాండిచ్చేరిలో నివాసం వుంటున్నట్టు చెప్పింది. తన అనేక కారణాలతో బాధ పడుతున్న సమయంలో అతని పరిచయం ఏర్పడి, ఊరటనిచ్చింది. నా కెరియర్ కోసం అతను ఉద్యోగం కూడా వదులుకుని మరీ నాకు అండగా నిలచాడని చెపుతూనే ఆతని పేరు వెల్లడించేందుకు నిరాకరించింది. ఇటీవలే అమలాపాల్ నుంచి విడాకులు పొందిన ఆమె మాజీ భర్త డైరెక్టర్ విజయ్ చెన్నై నగరానికి చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకున్న నేపథ్యంలో తను ప్రేమలో పడి, సహజీవనం చేస్తున్నానని అమలాపాల్ బాంబు పేల్చడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa