ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2020లో ‘వ‌రుణ్‌ధావ‌న్’ వివాహం

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2019, 11:25 AM

బాలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా వెలిగిపోతున్న న‌టుడు వరుణ్ ధావన్ తన గాళ్ ఫ్రెండ్ నటాషా దలాళ్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ జంట పెళ్లి గోవాలో జరగనుందని.. ముంబైలో ఘనంగా రిసెప్షన్ ఉంటుందని గతంలో ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. వెన్యూ తో పాటు పెళ్లి తేదీ మారింద‌ట‌. వరుణ్ – నటాషా జంట పెళ్లి 2020లో ఉంటుంది. జోధ్ పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఈ వివాహం జరగనుంది. ఉమైద్ భవన్ అనగానే ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ (నిక్యాంక జోడీ) మూడు రోజుల పెళ్లి గుర్తుకు రావాల్సిందే. ఈ జంట భారీగా బంధుమిత్రుల సమక్షంలో ఇరువురి సాంప్రదాయాల్లో పెళ్లాడుకున్నారు. అదే తరహాలో ఘనంగా వ‌రుణ్ ధావన్ తన ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa