ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రదర్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:50 PM

కోలీవుడ్ నటుడు జయం రవి ఇటీవల విడుదలైన 'బ్రదర్' ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. ఎం రాజేష్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. దీపావళికి విడుదలైన ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ జీ5లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో భూమికా చావ్లా, రావు రమేష్, నటరాజన్ సుబ్రమణ్యం, వీటీవీ గణేష్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. లిమిటెడ్ నిర్మించారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa