‘లవ్ టుడే’ సినిమాతో తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ చక్కని గుర్తింపును తెచ్చుకున్నాడు. కామెడీ రొమాంటిక్ చిత్రంతో తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. పక్కా యూత్‌ఫుల్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ర్టీమింగ్ కానున్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa