ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో విడుదల కానున్న 'జాట్‌' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 06:02 PM

టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'జాత్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాతో గోపీచంద్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల విడుదలైన యాక్షన్-ప్యాక్డ్ టీజర్ గణనీయమైన దృష్టిని ఆకర్షించింది మరియు ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దాని ఒరిజినల్ హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు మరియు తమిళంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ త్వరలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం అధికారక తేదీని వెల్లడి చేయనున్నది. నిధీ అగర్వాల్ హై-ఎనర్జీ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా కూడా ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. జాత్‌ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa