ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రైలర్ టాక్: ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా 'జాక్ పాట్'

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 01:27 PM

నిన్నటి తరం కథానాయికలుగా జ్యోతిక .. రేవతి ఒక వెలుగు వెలిగారు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేశారు. రీ ఎంట్రీలోను విభిన్నమైన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ, ముందుకు వెళుతున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ప్రధానమైన పాత్రధారులుగా తమిళంలో 'జాక్ పాట్' చేశారు.


తమిళంతో పాటు తెలుగులోను అదే టైటిల్ తో వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో జ్యోతిక .. రేవతి వివిధ రకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు. వాళ్లు ఇచ్చే బిల్డప్స్ ను బట్టి, ఇది పూర్తిగా వినోదభరితమైన సినిమా అని తెలుస్తోంది. సూర్య తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి, కల్యాణ్ దర్శకుడిగా వ్యవహరించాడు. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa