ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పెద్ది' టైటిల్ విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 02:43 PM

మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు చరణ్ చేయనున్న 16వ సినిమాపై ఉన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను. మైత్రీ - సుకుమార్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మైసూర్ .. హైదరాబాదులలో కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.ఈ సినిమా కథ రాసుకునేటప్పుడే బుచ్చిబాబు 'పెద్ది' అనే టైటిల్ ను అనుకున్నాడు. ఈ టైటిల్ కి అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. ఈ టైటిల్ పట్ల ఆయన అయిష్టతను వ్యక్తం చేశాడనే ప్రచారం బలంగానే జరుగుతోంది. దాంతో టైటిల్ పై టీమ్ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా టాక్. ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు. అందువలన ఆ రోజున టైటిల్ పోస్టర్ ని వదలొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు టైటిల్ లేకుండానే ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయవచ్చనే అంటున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ .. జగపతిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa