సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒడిశాలో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావడం తన జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. ఈ సినిమా జోనర్ మాత్రమే సాహసం కాదని ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం తనకు అడ్వెంచర్ తో కూడుకున్న పని అని చెప్పారు. ఇది చాలా కష్టమైన ప్రయాణమని కానీ, తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. సరికొత్త సౌండ్స్ ని ఈ జోనర్ కోసం సృష్టించబోతున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa