త్వరలో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అనే చిత్రంతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుంది నటి తాప్సీ. నటుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. ఈ రోజు హన్సిక బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుండి ఆమె స్టైలిష్ లుక్ విడుదల చేశారు. పింక్ ప్యాంట్, బ్లాక్ బ్లేజర్ ధరించిన హన్సిక ఈ చిత్రంలో లాయర్ పాత్రలో కనిపించనుంది. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్ర టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం సాంగ్‌కి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. ఈ ఏడాది చివరిలో మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులో లేడీ విలన్‌గా కనిపించనుంది. జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బేనర్‌పై నిర్మితమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa