కోలీవుడ్ యువ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే డ్రాగన్‌తో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న తరువాత నటుడు ప్రస్తుతం తెలుగు తమిళ ద్విభాషా చిత్రానికి పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి మేకర్స్ 'డ్యూడ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్-లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేయగా సానుకూల స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తమిళనాడు అండ్ కర్ణాటక థియేటర్ రైట్స్ ని రోమియో పిక్చర్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. యువ దర్శకుడు కీర్తిస్వారాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని మైథ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్రింద నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్-ఇండియా విడుదల కానుంది. సాయి భాంక్కర్ ఈ చిత్ర సంగీత స్వరకర్తగ ఉన్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, రోహిని మొల్లెటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో దీపావళి 2025 సందర్భంగా విడుదల కానుంది.
![]() |
![]() |