ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌తో రాబోతున్నట్లు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రకటించారు

cinema |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 06:54 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌తో రాబోతున్నట్లు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రకటించారు. దీనిపై ఎన్టీఆర్ కూడా అంతే ఆసక్తికరంగా స్పందించారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' సినిమా నుంచి ఈ కానుక ఉండబోతోందని తెలుస్తోంది. ఈ వార్తతో ఇరువురి అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తోంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ ప్రత్యేక కానుకను విడుదల చేయనున్నట్లు హృతిక్ రోషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదేంటో ఊహించగలవా? అని ఎన్టీఆర్ ను టీజ్ చేశారు.హృతిక్ చేసిన ఈ ప్రకటనపై ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. సర్‌ప్రైజ్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, "కబీర్ వార్ సినిమాలో హృతిక్ పాత్ర పేరు నిన్ను వేటాడి, నీకు నేనే ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు స్టార్ల మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com