తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇటీవలే విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ కామెడీ డ్రామా ఇప్పటివరకు 50 కోట్లు వాసులు చేసింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా మే 31న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించనుంది. ఈ చిత్రంలో శశి మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మిలియన్ డాలర్ స్టూడియోలు మరియు MRP ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతాన్ని సీన్ రోల్డాన్ స్కోర్ చేశారు. అబీషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భగవంత్, యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
![]() |
![]() |