శుభం మూవీతో నటి సమంత నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో చిత్ర బృందం సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. తాజాగా శుభం మూవీ సక్సెస్ వేడుకలో సమంత పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా శుభం సక్సెస్ మీట్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈవెంట్‌లో పాల్గొన్న సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న అతను వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన సమంత వెంటనే అతని దగ్గరకు వెళ్లి ఓదార్చింది. హృదయానికి హత్తుకుని మరి అసిస్టెంట్‌ను సముదాయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సమంత గ్రేట్ అంటూ కాంప్లిమెంట్స ఇస్తున్నారు.
![]() |
![]() |