ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టూరిస్ట్ ఫ్యామిలీ' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 22, 2025, 04:28 PM

తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇటీవలే విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ కామెడీ డ్రామా ఇప్పటివరకు 50 కోట్లు వాసులు చేసింది. ఈ చిత్రం లో శశి మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అబీషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భగవంత్, యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 31న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మేకర్స్ డిజిటల్ ప్లాట్ఫారంని ఈ సినిమాని జూన్ మొదటి వారం వరకు వాయిదా వేయమని కోరినట్లు లేటెస్ట్ టాక్. రానున్న రోజులలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించనుంది. మిలియన్ డాలర్ స్టూడియోలు మరియు MRP ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి  సంగీతాన్ని సీన్ రోల్డాన్ స్కోర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa