15 ఏళ్ళ క్రితం వచ్చిన ‘నాగ’ చిత్రంతోనే ఇండస్ట్రీకి పరిచయమైనా ‘జబర్దస్త్’ షో తోనే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. ఈ షో లో తన గ్లామర్ తో కుర్రకారుని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక సినిమల్లో కూడా తనదైన నటనతో మెప్పించింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘ఎఫ్2’ ‘యాత్ర’ వంటి చిత్రాలతో మంచి హిట్లందుకుంది. అయితే ఇటీవల వచ్చిన ‘కథనం’ సినిమా మాత్రం ఈమెకు చేదు అనుభవాన్నే ఇచ్చింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా ఈ హాట్ బ్యూటీ యమ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. హాట్ హాట్ ఫోటోలని కూడా షేర్ చేస్తుంటుంది.
ఈ క్రమంలో ఈమె పై ఎక్కువగా ట్రోల్స్ కూడా వస్తుంటాయి. తాజాగా అనసూయ మోడ్రన్ డ్రెస్ లలో చేస్తున్న ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే ట్రోలింగ్ కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. దీని పై అనసూయ స్పందించింది. ” నేనిప్పుడు ట్రోలింగ్ ని పట్టించుకోవడం మానేశాను. నా డ్రెస్సింగ్ స్టైల్ నా ఇష్టం. ఇదే నార్త్ ఇండియన్ హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తే చూస్తారు.. గ్లామరస్ గా ఉందని పొగిడేస్తారు. కానీ నా పై మాత్రం బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నా యాంకరింగ్ గురించి కూడా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ‘ఆ డ్రెస్సింగ్ ఏంటి… సుమని చూసి నేర్చుకో’ అనే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. నేను, సుమ, ఝాన్సీ లాంటి యాంకర్స్ పెళ్ళైనవాళ్ళమే. ఎవరి వెసులుబాటుకు తగ్గట్లుగా వారు యాంకరింగ్ చేస్తున్నారు. కానీ వారి అనుభవం ముందు నేను తక్కువే. అలాగని కొందరు సుమని చూసి నేర్చుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. సుమలా నేనెందుకు ఉండాలి.. ఆమెనే… నాలాగా ఉండమని చెప్పొచ్చుగా… ? కాలాన్ని బట్టి ఎలా యాంకరింగ్ చేయాలో సుమకు చెప్పొచ్చుగా..? కాబట్టి ఎవ్వరూ సలహాలు ఇవ్వకూడదు” అంటూ తెగ విరుచుకుపడుతుంది. అయితే సుమ ఎవర్గ్రీన్ యాంకర్. ఆమెకి ఫ్యామిలీ ఆడియన్సే కాదు.. యూత్ కూడా ఆమె యాంకరింగ్ ను ఇష్టపడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి సుమ ను… ‘నన్ను చూసి నేర్చుకో’ అని అనసూయ అనడం… అనసూయ కాస్త అతిగా ప్రవర్తించిందనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa