ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ స్థాయిలో తెరకెక్కడానికి ప్రభాస్‌ ప్రధాన కారణం..

cinema |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 03:18 PM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం 'కన్నప్ప'. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విష్ణు ప్రచారంలో జోష్‌ పెంచారు. వరుస ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పాత్రల నిడివి ఎంతంటే.. ప్రభాస్‌ను మొదట అతిథి పాత్ర కోసం తీసుకున్నాం. కానీ 30 నిమిషాలు పెంచాం. 'కన్నప్ప'లోముఖ్యమైన చివరి 50 నిమిషాలు ప్రేక్షకులు అతడిని చూస్తారు. మోహన్‌బాబు, ప్రభాస్‌ల మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. మోహన్‌లాల్‌ పాత్ర 15 నిమిషాలు కనిపిస్తుంది. శివుడిగా అక్షయ్‌ కుమార్‌ 10 నిమిషాలు స్క్రీన్‌పై కనిపిస్తారు. దీని మొత్తం రన్‌టైమ్‌ 3 గంటల 10 నిమిషాలు. బాధ్యతతో పాటు భయం.. ఇప్పటి వరకూ నా కెరీర్‌లో ఇంత భారీ సినిమా చేయలేదు. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో భయపడ్డాను. దీని ట్రైలర్‌ విడుదలైనప్పుడు అందులో కొన్ని తప్పులు ఉన్నాయని నాకు కొంతమంది మెసేజ్‌ చేశారు. వాళ్లను పిలిచి మాట్లాడాను. వీఎఫ్‌ఎక్స్‌ బాధ్యతలు వారికి అప్పగించాను. వాళ్లు ఓకే అంటేనే ఇప్పుడు ఫైనల్‌ అవుట్‌పుట్‌ బయటకు వస్తుంది. టీజర్‌, ట్రైలర్‌లలో చిన్న తప్పులు కనిపెట్టిన వారిని కూడా నేను అభినందించాను. అందుకే వారికి బాధ్యతలిచ్చాను. సినిమా వాళ్ల వ్యాఖ్యలు అహంకారపూరితం.. అది వారి విజ్ఞతకు వదిలేశాం: కందుల దుర్గేష్‌ వారిపై పుస్తకం రాయిస్తున్నా.. తెలుగు సినిమా చరిత్రపై పుస్తకం రాయిస్తున్నాను. దీని కంటే ముందు ఇండస్ట్రీలోని నటీనటుల గురించి రాయించాలి. మరో 25 సంవత్సరాలు తర్వాత ఎస్వీ రంగారావు ఎవరనే ప్రశ్న ఎవరూ వేయకూడదు. ఈరోజు ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలకు కూడా చిత్తూరు నాగయ్య ఎవరంటే తెలియకపోవచ్చు. అందుకే వారందరిపై ఒక పుస్తకం తీసుకురానున్నాను. ప్రభాస్‌కు రుణపడి ఉన్నా.. ప్రభాస్‌కెరీర్‌లోనే నటనపరంగా 'కన్నప్ప' చిత్రం బెస్ట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఇంత భారీ స్థాయిలో తెరకెక్కడానికి ప్రభాస్‌ ప్రధాన కారణం. ఇందులో పాత్ర గురించి చెప్పగానే వెంటనే అంగీకరించాడు. 'కన్నప్ప' పెద్ద హిట్ అవుతుందని ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు. రక్తం పంచుకొని పుట్టకపోయినా ప్రభాస్‌ నా మంచి కోరుకుంటాడు. గతంలోనూ నా సినిమాల విడుదలకు ముందు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు ఏమైనా చేయమంటావా అని అడిగేవాడు. ఈరోజుల్లో అలా ఎవరు ఉంటారు. అందుకే అతడికి రుణపడి ఉన్నాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa