అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న దగ్గుబాటి రానా ఇపుడిపుడే కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానా.. లాస్ ఏంజెల్స్‌లో నేను కోలుకుంటున్నాను. వచ్చే నెలలో భారత దేశానికి తిరిగొస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం రానా..‘విరాట పర్వం’, ‘హిరణ్యకశ్యప’తో పాటు హిందీలో హౌస్‌ఫుల్ 4 సినిమాలతో పలకరించనున్నాడు. ‘హిరణ్యకశ్యప’ విషయానికొస్తే.. ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కనుంది. దీనితో గత కొన్ని రోజలుగా రానా ఆరోగ్యంపై వస్తున్న వార్తలకి చెక్ పెట్టినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa