నానీస్ గ్యాంగ్ లీడర్…ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదిన విడుదల కాబోతోంది. ఒక్కసారి మనం ట్రైలర్ ని చూసినట్లయితే,,ఇందులో నాని పెన్సిల్ పార్ధసారధి అనే రైటర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. తను ఫేమస్ రివేంజ్ రైటర్ గా ఇందులో కనిపిస్తున్నాడు. అంతేకాదు, ఎంతో ఫన్నీ గా ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ వాటిని యాజ్ టీజ్ తెలుగులో రీరైట్ చేసి పుస్తకాలుగా మార్చే రైటర్ గా నాని కనబడుతున్నాడు. పెన్సిల్ ని కలవడానికి ఐదుగురు ఆడవాళ్లు వస్తారు.వీళ్లదంరూ కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కలిగి ఉన్నారు.ఇక్కడే పబ్లిషర్ గా మనకి కమెడియన్ ప్రియదర్శి కనిపిస్తున్నాడు. ఐదుగురు ఆడవాళ్లకి సంబంధించిన రివేంజ్ తీర్చే ఫేమస్ రివైంజ్ రైటర్.. మనస్టోరీ ఇదే అనే డైలాగ్ లోనే గ్యాంగ్ లీడర్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేసారు. అంతేకాదు, ట్రైలర్ లో డైలాగ్స్ అన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి.
ప్రతి డైలాగ్ ఫన్నీగా, ఎంతో సెటైరికల్ గా రాసినట్లుగా తెలుస్తోంది. నాని క్యారెక్టర్ కే నవ్వు వచ్చేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు అందరూ. ఇక సినిమా అవుట్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ అని ఈ ట్రైలర్ ద్వారా ముందుగానే చెప్పేసారు.ఇక సినిమాలో విలన్ క్యారెక్టర్ లో మనకి మరో హీరో కార్తీకేయ కనిపిస్తున్నాడు. లక్ష్మీ, శరణ్య, నాని , ప్రియదర్శి, వెన్నెలకిషోర్ ఈ సినిమాలో నవ్వులు పూయించడం పక్కగానే కనిపిస్తోంది.
బామ్మా.. రసీద్ అంటే బిల్.. కిల్ బిల్ అనే మూవీ అది.. పెద్ద ఫ్రాడ్ వీడు అనే డైలాగ్,రైటర్స్ అంటే అంతే.. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం అనే డైలాగ్, ఇక లాస్ట్ లో నాని చెప్పిన డైలాగ్ ఓరేయ్.. నేను ఇంకా థ్రిల్లర్ జోనర్ లోనే ఉన్నా, సైకో కిల్లర్ జోనర్ లోకి వెళ్లేలోగా మొదలెట్టేద్దాం… అనే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. వీక్ నెస్ గా అమ్మాయి ఉండాలంటే లక్ష్మీ నేను సిద్ధమని ముందుకు రావడం నవ్వులు పూయించింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే వచ్చే నెల 13 వరకు వెయిట్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa