ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'శ్రీ శ్రీ రాజావారు'

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 07:53 AM

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నే నితిన్ ప్రధాన పాత్రలో నటించిన "శ్రీ శ్రీ శ్రీ రాజావారు" ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌స్ ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో సంపద కథానాయికగా నటిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి  కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మధు ఎడిటింగ్ చేస్తుండగా, శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. రంగాపురం రాఘవేంద్ర, మురళీకృష్ణ చింతలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్‌ పబ్లిసిటీ డిజైన్‌ గా ఉన్నారు. ఎన్టీఆర్ ఆమోదంతో ఎంచుకున్న ఈ కథను సతీష్ వేగేశ్న "శ్రీ శ్రీ శ్రీ రాజావారు" రచన మరియు దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం టోవినో థామస్ 2018 మలయాళం హిట్ చిత్రం 'థీవండి' కి రీమేక్. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa