యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా కేజీఎఫ్ 2 షూటింగ్ ఆపాలి అని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కోలార్ ఫీల్డ్స్‌లోని సైనైడ్ హిల్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతుందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అతని వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయస్థానం వెంటనే సైనైడ్ హిల్స్‌లో జరుగుతున్న కేజీఎఫ్ 2 షూటింగ్‌ను ఆపాలని ఆదేశాలిచ్చింది. అర్ధాంతరంగా షూటింగ్ ఆపడం తో ఆ చిత్రయూనిట్ కొత్త లొకేషన్ల కోసం వేట ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa