టాలీవుడ్ లో అరవై సంవత్సరాలు వచ్చినా ఇంకా నవ మన్మధుడు గానే రాజ్యమేలుతున్నారు కింగ్ నాగార్జున .. ఆయన 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60 వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. భక్తిలో....అన్నమయ్య ఆయనే... నట శోధనలో శివ ఆయనే... అందంలో నిత్య మన్మధుడు ..నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. అయితే...మొదట్లో నాగార్జున...తన తండ్రి బాటలోనే సినిమాల్లో వచ్చినా....ఈ రోజు.. నేటి సినిమాల్లో... నాగార్జున తన మొదటి కుమారుడు నాగ చైతన్య, రెండవ కుమారుడు అఖిల్ తో పోటిలో నిలుస్తున్నాడు. అయితే నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి.
అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు . ముఖ్యంగా ప్రేమకథలకు స్పెషల్ హీరోగా మిగులుతున్నాడు నాగ్ ... మొన్నటికి మొన్నా మన్మధుడు 2 అనే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడంటే ఇంకా నాగ్ లో ఆ ప్రేమికుడు ఇంకా పోలేదనే కదా అర్ధం ... బాలనటుడుగానే నాగార్జున తెలుగుసినిమాల్లో నటించారు . ఆయన తండ్రి నటించిన సుడిగుండాలు సినిమాల్లో నాగ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు .ఆయన సినిమాల్లోకి రాకముందు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు కుమార్తె లక్ష్మిని ఆయన 1984లో వివాహం చేసుకున్నారు ఇక నటుడుగా 1986 లో విక్రమ్ సినిమాతో పరిచయం అయ్యారు . ఆయన మణిరత్నంతో చేసిన గీతాంజలి సినిమా ఆయనకి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది . 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా నాగార్జునని స్టార్ హీరోగా నిలబెట్టింది . ఇదే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు నాగ్ . 1990 మొదటిభార్యకు లక్ష్మికి విడాకులు ఇచ్చారు . వీరికి పుట్టిన సంతానమే అక్కినేని నాగ చైతన్య . 1992లో నాగార్జున హీరోయిన్ అమలని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన సంతానమే అక్కినేని అఖిల్ . నాగార్జున హైదరాబాద్ యొక్క బ్లూ క్రాస్ పేరుతో వెళ్ళే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జిఓ) సహ వ్యవస్థాపకుడు. ఎన్జీఓ జంతువుల సంక్షేమం కోసం పనిచేస్తుంది మరియు జంతు హక్కులను కాపాడుతుంది. HIV / AIDS అవగాహన కార్యక్రమాలకు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు . మొత్తం నాగార్జున ఇప్పటివరకు ఒక జాతీయ అవార్డు(అన్నమయ్య), 9 రాష్ట్ర నంది అవార్డులు మరియు 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినీ హీరోగానే కాకుండా బడా నిర్మాతల్లో నాగార్జున ఒకరుగా నిలుస్తు వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పై ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు . సినిమాలు కాకుండానే ముంబై మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కి సునీల్ గవాస్కర్ తో కలిసి భాగస్వామిగా వ్యవహరించారు . మనం సినిమాలో నాగ్ తన మొత్తం కుటుంబంతో కలిసి నటించారు . ఇది తెలుగులో మరే హీరోకి కూడా ఇలాంటి ఘనత దక్కలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన మన్మధుడికి తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగేలేదు. ఇంకా ఎన్నో మంచి చిత్రాలు నాగార్జున చెయ్యాలని ఆశిస్తూ...మరొకసారి..జన్మదిన శుభాకాంక్షలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa