ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను నా నాగార్జున ఆడియో విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2019, 05:33 PM

హాస్యనటుడు మహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేను నా నాగార్జున. జీఎన్‌ఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై గుండపు నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఆర్‌.బి.గోపాల్‌ దర్శకుడు. హీరో నాగార్జున జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో ఆడియోను ఆవిష్కరించారు. ఈశ్వర్‌ పెరావళి సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర గీతాల్ని మళ్ల విజయ ప్రసాద్‌, ట్రైలర్‌ను నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ విడుదల చేశారు. మహేష్‌ మాట్లాడుతూ రంగస్థలంలో నటించడానికి ముందు చేసిన సినిమా ఇది. ఇందులో ఓ సైకిల్‌ షాప్‌ యువకుడి పాత్రలో కనిపిస్తారు. మా ఊళ్లో ఉండే రాంబాబు అనే కుర్రాడిని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాత్ర చేశాను. ఈ చిత్రం ఆద్యంతం నవ్విస్తుంది అని చెప్పారు. ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాను పూర్తిచేశామని, త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ట్రైలర్‌, పాటలు బాగున్నాయి. నిర్మాతకు పేరుతో పాటు డబ్బులు తెచ్చిపెట్టాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్‌.దామోదరప్రసాద్‌, తోటపల్లి మధు, సాయివెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa